ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు


సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన

విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్రపంచ శాంతికి పెనుముప్పు వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వామపక్షాలు, ప్రజాస్వామిక పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మైలవరం నియోజకవర్గం లో సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదాలతో శనివారం చెవుటూరులో పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోటేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ లో దారుణ మారణ కాండను సృష్టిస్తున్నాయని చివరకు బడి పిల్లలను కూడా వదలకుండా స్కూల్ భవనాలపై బాంబులు వేసి వందలాది మంది చిన్నారులను హతమార్చున్నారంటే ఎంత కర్కస రాక్షసత్వము అర్థం అవుతుందని అన్నారు. అక్రమ యుద్ధాల ద్వారా లోపర్చుకున్న దేశాలపై ఆధిపత్యాన్ని చాటుకుంటూ సైనిక స్థావరాలను ఆయుధ కేంద్రాలను ప్రపంచానికి ఖబర్దార్ అనే హెచ్చరికలు జారీ చేసేందుకు అమెరికా నిత్యం ఉవ్విళ్ళురుతోందని తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ భద్రతామండలి న్యాయస్థానాలు కూడా కిమ్ అనకుండా మౌన పాత్ర వహించడం దుర్మార్గం అని అన్నారు మన దేశం కూడా ఇంత ప్రమాదకర విపత్తు సమయంలో ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత బాధాకరమని అన్నారు ఈ యుద్ధ ప్రభావంతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుందని తెలియజేశారు . మన దేశంలో ఇప్పటికే గ్యాస్ ఆయిల్ నిత్యవసర వస్తువులపై యుద్ధం ఇంకా కొనసాగితే ప్రజా జీవితం అయోమయంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ యుద్ధ నివారణకు ప్రజలంతా మమేకమై పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్ , స్థానిక పార్టీ, ప్రజాసంఘాల నాయకులు షేక్ దావూద్ వలి మస్తాన్వలి చింతయ్య బాబు సాహెబ్ పెద్ద కృష్ణయ్య షేక్ మస్తాన్ బి గాలి బుబి దావూల్ బి మన్నేబి మంగమ్మ లతోపాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *