ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే… ప్రస్తుతం ఈ పోస్టు డిలీట్ అయింది. ఆ నౌకులను స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్టియాగా గుర్తించారు. వీటి యజమానులు విదేశాల్లో ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా… ఇరాన్ ప్రభుత్వం మీడియా వీటిని తోసి పుచ్చింది. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ని ఉటంకిస్తూ సీజ్ అయిన మూడు నౌకలకు దానితో సంబంధం లేదని తెలిపింది. గ్లోబల్ పీస్, చిల్ 1, గ్లోరీ స్టార్1 అనే నౌకలపై యూఎస్ గ తేడాది ఆంక్షలు విధించింది. వీటి ఐఎంఓ నంబర్లు తాజాగా సీజ్ అయిన నంబర్లు ఒకటిగా తెలుస్తోంది. నూకల స్వాధీనం అనంతరం సముద్రతీరంలో భారత అధికారులు భద్రతను కొట్టుదిట్టం చేశారని రైటర్స్ పేర్కొంది. అక్కడ నౌకలు, విమానాలతో నిఘా ఉంచినట్లు తెలిపింది.
The post ఇరాన్ నౌకలను సీజ్ appeared first on Visalaandhra.


