ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి


గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు ఉన్నారని సమీపంలోని అల్ అక్సా ఆసుపత్రి తెలిపింది. కాగా, ఈ దాడిలో చనిపోయిన గర్బిణి మహిళ కడుపులో ఇద్దరు కవలపిల్లలున్నారని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. అలాగే ఈ దాడిలో పొరుగింటి 15 ఏళ్ల కుర్రాడు కూడా చనిపోయాడు. ఈ దాడిలో అతను గాయాలపాలైతే చికిత్స కోసం నుసేరాత్‌లోని అల్- అవ్దా ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దక్షిణ ఉత్తర ఫిలడెల్ఫీ కారిడార్‌లోని అజ్- జవాయ్డా పట్టణ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసు వాహనంపైనా బాంబు దాడి జరిగింది. ఇజ్రాయిల్ దాడిలో సీనియర్ పోలీసు అధికారి కల్నల్ ఇయాద్ అబ్ యూసఫ్‌తో సహా 9 మంది పోలీసులు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *