న్యూదిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చమురు కంపెనీలు 10 కిలోల గ్యాస్‌తో చిన్న సిలిండర్లు ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ దిగుమతులకు అంతరా యం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్‌పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచి వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహా లను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశ పెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై సమీక్షి స్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్‌పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యా మ్నాయ దిగుమతి మార్గాలు అన్వేషించడం, నిల్వలు పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.


