విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ అందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామాంజనేయులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుపేదలకు మూడు సెంట్లు, పట్టణాల్లో నివాసం ఉండే వారికి రెండుసెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారని అధికారం వచ్చి 21 మాసాలు అయినా నేటికి దాని ఊసే లేదన్నారు. ఇప్పటికే సీపీఐ ఆద్వర్యంలో పేదలకు నివాసస్థలం ఇవ్వాలని పలుమార్లు ఆందోళన చేసిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రిని కలసి పేదలు ఆక్రమణలో ఉన్న ఇంటిస్థలాýకు పట్టాలని ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు దీనిపై ఏమాత్రం మాట్లాడం లేదన్నారు. ప్రదాని మోడీకి అనుకూలమైన వారికి పెద్దఎత్తున విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని, పేదలకు ఇంటిస్థలం ఇవ్వడానికి పట్టించుకోని ప్రభుత్వం కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెగువీరా వారసులం అనిచెప్పుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దీనిపై ఏమాత్రం మాట్లాడటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. టిడ్కో గహాలలో మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణీ చేయాలన్నారు.లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. అనంతరం సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్ మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. తక్షణమే ప్రభుత్వం నివాస్థలం లేని పేదలకు ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు పట్టణాల్లో రెండుసెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహర్‌మాణిక్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసులు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లాకార్యదర్శి శ్రావణి, నగర కార్యదర్శి భారతి, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు సీ మహేష్, శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, బీసన్న, కుమార్, రామచంద్రుడు , నగర సమితి సభ్యులు, వివిధశాఖల కార్యదర్శులు ప్రజాసంఘాలనాయకులు, పేదలప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నార


