ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ – Visalaandhra


విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అత్యంత కీలకమైన ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడంలో సహకరించి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడంతో జిల్లాలో ఆర్డీటీ సేవలు యధాతధంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వానికి జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమకు ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం గొప్ప నిదర్శనం అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *