అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ
న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా… దీనికి ముందు రోజు ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా తాజాగా వైరల్ అవుతుంది. అందులో ట్రంప్ కుర్చీలో కూర్చునేందుకు ఇబ్బంది పడినట్లుగా కనిపిస్తోంది. దీంతో అధ్యక్షుడి ఆరోగ్యం పై మరోసారి వార్తలు వస్తున్నాయి. దీనిపై చాలామంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. ట్రంప్ ఆరోగ్యం పై గతంలో కూడా చర్చ జరిగింది. వాటన్నిటిని వైట్ హౌస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. దక్షిణాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమస్యపై మరింత చర్చకు అవకాశం కలుగుతుంది.


