కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు
. కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు
. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక
. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి
. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు
తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల గుండెళ్లు రైళ్లు పరిగెత్తిస్తున్నది. అటు గల్ఫ్‌ను వణికిస్తోంది. కువైట్ నుంచి యూఏఈ వరకు విస్తతంగా దాడులు చేసింది. కువైట్‌లోని అతిపెద్ద రిఫైనరీ లక్ష్యంగా వరుసగా రెండవ రోజు డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో మీనా అల్ అహ్మదీ రిఫైనరీకి చెందిన అనేక యూనిట్లలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడ నిత్యం 7,30,000 బ్యారళ్ల చమురు శుద్ధీకరణ జరుగుతుంది. తమ దేశంపైకి వచ్చే క్షిపణులు, డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధంగా ఎదుర్కొంటున్నాయని యూఏఈ వెల్లడించింది. ఇరాన్ దాడిలో గిడ్డంగి తగలబడినట్లు బహ్రెయిన్ తెలిపింది. రెండు గంటల్లో రెండు డజన్లకుపైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.యూఏఈలో అల్ దఫ్రా ఎయిర్‌బేస్ వద్ద అమెరికా దళాలపై, ఇజ్రాయిల్‌లోని లక్షిత ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్సొ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పింది. శతృవు అలసిపోయే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించింది. చేతనైతే తమ యుద్ధ నౌకల్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించాలని అమెరికాకు సవాల్ విసిరింది. కాగా, ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే 16 కీలక యుద్ధ విమానాలను కోల్పోయింది. తాజాగా ఎఫ్ 35 విమానంపై ఇరాన్ దాడి చేయడం సంచలనంగా మారింది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ2 యుద్ధ విమానంపై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. ఆ విమానం బాగా దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 125కుపైగా అమెరికా, ఇజ్రాయిల్ డ్రోన్లను కూల్చామని పేర్కొంది. ఎఫ్35పై ఇరాన్ దాడిని అమెరికా ధ్రువీకరించింది. ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని వెల్లడించింది. మీకు ప్రపంచంలో ఎక్కడా రక్షణ ఉండదు: ఇరాన్ మీరు ప్రపంచంలో ఎక్కడున్న ముప్ప్పు తప్పబోదని ఇజ్రాయిల్, అమెరికా అధికారులను ఇరాన్ హెచ్చరించింది. క్షిపణుల తయారీ కొనసాగుతుందని కూడా తేల్చిచెప్పింది. ‘ఇప్పటి నుంచి పార్కులు, వినోద ప్రాంతాలు, పర్యాటక క్షేత్రాలపై గురి పెడతాం. తెహ్రాన్ శత్రువులకు ఈ ప్రపంచంలోని ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదు’ అని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకార్చి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి ఇరాన్ మరో సైన్యాధికారిని కోల్పోయింది. కీలక బాధ్యతల్లో ఉన్న ఐఆర్‌జీసీ ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయినీ తాజా దాడుల్లో మృతి చెందారు. శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆయన హత్యకు గురయ్యారు. నయినీ మరణించడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి యుద్ధం జరుగుతున్నప్పటికీ తమ క్షిపణి పరిశ్రమ అత్యున్నత స్థాయికి చేరుకుందని అన్నారు. దాడులను ఎదుర్కొంటూనే ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తమకు సరిపడ నిల్వలు ఉన్నాయని చెప్పారు. యుద్ధం కొనసాగే క్రమంలో తమ శత్రువులకు సర్‌ప్రైజ్‌లు అందుతాయని నయినీ ఎదరు దాడి చేశారు. యురేనియం శుద్ధీకరణ, క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని నెతన్యాహు చెప్పడాన్ని ఆక్షేపించారు. అలాగే ఇరాన్ నౌకాదళం ధ్వంసమైందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చారు. తన నౌకలను పర్షియన్ గల్ఫ్‌లోకి అమెరికా పంపగలదా అంటూ సవాల్ విసిరారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో నయినీ ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సులేమానీని ఇరాన్ కోల్పోయింది. ఇంటెలిజెన్స్ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప్పుడు మహమ్మద్ నయినీ మరణించడంతో ఇరాన్ దాడులు పెంచింది. నయినీ మరణించినట్లు ఐఆర్‌జీసీ ధ్రువీకరించింది. అమెరికాకు ఆయుధాలు పంపం: స్విట్జర్లాండ్ యుద్ధం సమయంలో స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఆయుధాల ఎగుమతులను ఆపేసింది. యుద్ధం చేస్తున్న అమెరికాకు ఘర్షణ కాలంలో ఆయుధాల ఎగుమతులకు అనుమతి ఇవ్వబోమని ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు ఆరు నెలలు: ఐఈఏ గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించడం కోసం మరో ఆరు నెలల వరకు సమయం పట్టవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అధిపతి ఫహిత్ బిరోల్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాతంలో చమురుగ్యాస్ మౌలిక వసతులకు కలుగుతున్న అంతరాయాన్ని రాజకీయ నాయకులు, మార్కెట్లు తక్కువగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద చమురుగ్యాస్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చెక్ రిపబ్లిక్‌లో ఇజ్రాయిల్ ఆయుధ కర్మాగారానికి నిప్ప్పు చెక్ రిపబ్లిక్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఆయుధాల కర్మాగారానికి ‘ది ఎర్త్‌క్వేక్ ఫాక్షన’ గ్రూపుకు చెందిన కొందరు నిప్ప్పుపెట్టారు. తెల్లవారు జరిగిన ఈ ఘటనలో చెక్ కంపెనీ, ఇజ్రాయిల్ ఆయుధాల దిగ్గజం ఎల్బిట్ సిస్టమ్స్‌కు చెందిన అనేక భవనాలకు నష్టం జరిగింది. గజా, ఇరాన్ సహా ఇజ్రాయిల్ చేసే యుద్ధాలకు భూతలవైమానిక అస్త్రాలను ఎల్బిట్ సిస్టమ్స్ ఎక్కువగా సమకూరుస్తుంది. ది ఎర్త్‌క్వేక్ ఫాక్షన్ అనే సంస్థ టెలిగ్రామ్ ద్వారా స్పందించింది. ‘ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేసే అతిపెద్ద సంస్థకు చెందిన కర్మాగారం తగలబడిపోతోంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలను వేడుకునేందుకు సమయం లేదు. హత్యాకాండ ఆపేందుకు మేము చేయగలిగినది చేస్తాం’ అని ఆ సంస్థ పేర్కొంది.
సిరియాపైనా ఇజ్రాయిల్ దాడులు
ఇరాన్, లెబనాన్‌తో పాటు సిరియాపైనా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ ప్రతీకార దాడుల క్రమంలో ఇజ్రాయిల్ రాజధానితో పాటు అనేక చోట్ల సైరన్లు మోగినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. తమ వైపునకు వచ్చే క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. సిరియాపై తాజాగా దాడులు చేసింది. అక్కడి సువేడా ప్రావిన్స్‌లోని మైనారిటీ డ్రుజే ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. సెంట్రల్ డమాస్కస్‌లోని సిరియా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయంపైనా దాడులకు పాల్పడింది. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై దాడులు చేస్తున్న క్రమంలో 500 మందికిపైగా సాయుధులను చంపినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. కాగా, ఇజ్రాయిల్ దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటికే వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, పది లక్షల మంది ఇల్లు, వాకిళ్లు వదిలి వెళ్లఙపోయారు. అటు ఇరాన్‌లో మతుల సంఖ్య 1500కు చేరువయ్యింది. ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయిల్‌లో 15 మంది చనిపోగా, అమెరికా సైననేఇకులు 13 మంది మరణించారు.
హోర్ముజ్ మార్గంలో ఆటంకాలు తొలగిస్తాం…
గత 20 రోజులుగా హోర్ముజ్ మార్గంలో చిక్కుకున్న తమ చమురు ట్యాంకర్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే లక్ష్యంతో యూరప్, జపాన్‌తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ యుద్ధ క్షేత్రంలోకి దూకాయి. హోర్ముజ్ కోసం ఈ ఆరు దేశాలు ఒక్కటయ్యాయి. నౌకల సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకునేందుకు సిద్ధమంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ ఈ విధంగా గ్యాస్, చమురు సంక్షోభం సృష్టించడం తగదంటూ, దాడులను ఖండించాయి. పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఇంధన మార్కెట్‌ను స్థిరపరచడానికి, సముద్ర మార్గంలో రవాణా సాఫీగా సాగించడానికి సమష్టిగా పని చేస్తామని వెల్లడించాయి.
The post ఆరని చమురు మంటలు appeared first on Visalaandhra.


