ఆరంభంలోనే బుమ్రాను దించాలి


ఇంగ్లాండ్ పై భారత్ దే కాస్త పై చేయిగా ఉండొచ్చు: గవాస్కర్
బెంగళూరు : టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో పోటీకి దిగుతోంది. బెంగళూరు వేదికగా గురువారం జట్ల మధ్య జరిగే ఈ పోరులో భారత్ డే కాస్త పై చేయిగా ఉండొచ్చని గవాస్కర్ అన్నాడు. అయితే స్టార్ బౌలర్ బుమ్రాను భారత్ ఆరంభంలోనే దించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. పవర్ ప్లే లోనే బుమ్రా తో కనీసం రెండు ఓవర్లు వేయించాలని అన్నాడు. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు పడగొట్టగల సత్తా బుమ్రా లో ఉందన్నాడు. బుమ్రాను 5వ ఓవర్ లో దింపుతున్నారని, అప్పటికే బ్యాటర్లు ఒక్కొక్కరు 8-10 బంతులు ఆడి క్రీజ్ లో కుదురుకుంటున్నారన్నాడు. దీనివల్ల భూమరాను సమర్థంగా ఎదుర్కొంటున్నారని చెప్పాడు. భిన్నమైన వంతులు వేసే భూములను అర్థం చేసుకోవడం బ్యాటర్లకు కష్టం, ఆరంభంలోనే ఆయన వస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుందని సన్నీ సూచించాడు. భారత్ ఇంగ్లాండ్ జట్టు రెండు బలంగా ఉన్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ లో తమతోకంగా కనిపిస్తున్నాయి అన్నాడు. రెండు జట్ల బౌలింగ్ లోను వైవిధ్యం ఉంది ఐపీఎల్ లో ఆడటంతో కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్లకు భారత్ లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందన్నాడు. నాకౌట్ మ్యాచ్ లో ఎలా ఆడాలో భారత్- ఇంగ్లాండ్ కు తెలుసు. అయితే పోరు మాత్రం పోరా హోరీగా సాగుతుంది. ఇక బ్యాటింగ్ లో భారత్ కు సరళత భారత్ కు కలిసొచ్చే విషయం అన్నాడు. తిలక్ వర్మ ఏ స్థానంలోనైనా ఆడగలిగే తెలివైన మ్యాటర్ అని, పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడతాడు. 5-6 స్థానాల్లో దిగి… తాను ఏమి చేయగలడో అది చేస్తాడు. వెస్టిండీస్ పై అతడు స్వేచ్ఛగా ఆడడం వల్లే సంజు శాంసన్ పై ఒత్తిడి తగ్గింది. అతడు ఆ మ్యాచ్ లో స్వేచ్ఛగా ఆడగలిగి భారత్ కు విజయాన్ని అందించాడన్నాడు.

The post ఆరంభంలోనే బుమ్రాను దించాలి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *