విరాళం అందజేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర-పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి 10,016 రూపాయలు ఆలయ ధర్మకర్త నల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహులు, గ్రామ పెద్దలు ఎంజీ నరసన్న, ఈరన్న, టీడీపీ నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు.


