అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు


విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన చిప్పల మార్కండేయ ధర్మవరంలో తయారు అయినటువంటి పట్టు వస్త్రాలను పట్టు పోవడానికి ప్రదర్శనకు ఉంచారు.ఈ ప్రదర్శనలో ధర్మవరం శాసనసభ్యులు శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్ , పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి , హోం మినిస్టర్ అనిత , ఇతర ప్రజాప్రతినిధులు ధర్మవరం పట్టుచీరలను ఆసక్తిగా తిలకించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *