అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి


విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి మనిషి అలవర్చుకున్నప్పుడే మానవతా విలువలు పెంపొందిస్తాయని తెలపడం జరిగిందన్నారు. నేటి ఈ సేవా కార్యక్రమంలో దాతగా బికే తులసమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందని, వారికి శ్రీ సత్య సాయి సేవ సమితి 2 తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి 2 చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయని తెలిపారు. అనంతరం ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *