తెలుగుదేశం పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో, రాష్ట్రంలో జోడెద్దుల లాంటి నాయకులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదేవిధంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత వేగంగా దేశంలో ఉన్న 29 రాష్ట్రాల కంటే పెట్టుబడుల తేవడంలో దూసుకుపోతుందని తెలిపారు. గతంలో చేనేత కార్మికులకు 100 యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీ అదేవిధంగా పవర్లూమ్ కు 200 యూనిట్లు ఉచిత కరెంటు సబ్సిడీ వచ్చేదని ప్రస్తుతం చేనేతలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీతో,పాటు పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీని ఎన్డీఏ ప్రభుత్వం అందివ్వడం జరుగుతుందని. కావున ప్రతి చేనేత పవర్ లూమ్ కార్మికులు తమ తమ సచివాలయాల్లోకి వెళ్లి కొత్తగా అర్జీ ఇచ్చి ఉచ్చుతా కరెంటుకు సబ్సిడీకి అర్హత పొందాలని,ప్రతి చేనేత , పవర్లూమ్ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయిలో విఫలమైందని,వైసీపీ నాయకులు పత్రికా కార్యాలయలపై దాడులు చేయడం చూస్తే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంగా భావించాల్సి వస్తోందని తెలిపారు
పత్రికా కార్లపై దాడులను తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందని నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మట్టికరిపిస్తుందని ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జెండా రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


