విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ ముర్తుజావళి, గోవర్ధన్ గిరి, టిడిపి మహిళా పట్టణ అధ్యక్షురాలు మీనాక్షి దేవి, నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.


