అర్ధంలేని డిమాండ్ల వల్లే చర్చలు విఫలం


అమెరికాపై మండిపడ్డ ఇరాన్

తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులు అంగీకరించని కారణంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ… అమెరికా చేసిన అర్థం లేని డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలం చెందాయని ఇరాన్ ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని పేర్కొంది. ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు చర్చలు జరిపిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ప్రతినిధులు అన్నివిధాలుగా చొరవ తీసుకున్నట్లు తెలిపింది. అయితే అమెరికా ఆ దిశగా ముందుకు రాలేదని ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా చర్చల్లో ప్రతిపాదించిందని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది. తాము వాటన్నింటినీ గట్టిగా తిరస్కరించినట్లు తెలిపింది. హోర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వట్టి చేతులతో వెళ్లిపోయారని వ్యాఖ్యానించింది. పరువు నిలుపుకోవడానికి వారికి మరో మార్గం ఏదీ మిగల్లేదని ఎద్దేవా చేసింది. ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ… ఇరుదేశాల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ… రెండు కీలక విషయాలాపై విభేదాలు రావడంతో ఒప్పందం కుదరలేదన్నారు. ఆ రెండు విషయాలు ఏంటనేది ఆయన స్పష్టం చేయలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *