ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.
కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ బహుమతి రూ.3000 లు, తృతియ బహుమతి రూ.2000లు. కవిత్వ రచనలో మొదటి బహుమతి రూ.3000లు, ద్వితీయ బహుమతి రూ. 2000లు, తృతియ బహుమతి రూ. 1000లు.
40 సంవత్సరములు, ఆ లోపు యువతీ యువకులు పోటీలో పాల్గొనేందుకు అర్హులు. రచయితలు తమ రచనలకు ఈ నిబంధనలు పాటించాలి. కథల పోటీలో కథ ఎ4 సైజు షీటుపై 16 పాయింట్ సైజులో ఒక వైపుననే డి.టి.పి చేసి పంపించాలి. కథ 5 పేజీలకు మించరాదు. అనువాదాలు, అనుసరణలు పనికిరావు. అది తన సొంతరచన అని రచయిత తప్పక హామీపత్రాన్ని జతచేయాలి. తెలుగువారి జీవితానికి సంబంధించిన ఏ అంశాన్ని అయినా కథా వస్తువుగా తీసుకోవచ్చు. కథావస్తువు తప్పనిసరిగా అభ్యుదయకరమైనదిగా ఉండాలి. రచనల మీద పేరు రాయకూడదు. విడిగా హామీపత్రం మీద మాత్రమే రాయాలి.
కవిత ఎ4 సైజు షీటుపై 16 పాయింట్ సైజులో ఒకవైపుననే రెండు పేజీలకు మించకుండా రాయాలి. కవితా వస్తువు రచయిత ఇష్టం. కవితా వస్తువు తప్పనిసరిగా అభ్యుదయ దృక్పథంతో ఉండాలి.
రచయితలు తమ రచనలను వల్లూరు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, 401 శ్రావణి రెసిడెన్సీ, 6/3, ఎస్.వి.ఎన్.కాలని, గుంటూరు`522006, చరవాణి: 9291530714 చిరునామాకు ఏప్రిల13 సోమవారం 2026లోగా అందే విధంగా పంపాలి. వాట్సాప్ ద్వారా పంపరాదు. నిర్ణయాధికారం న్యాయ నిర్ణేతలదే. ఏలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం ఉండదు.
వల్లూరు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు.


