అయ్యప్ప సేవా సమితి సేవలు ఎనలేనివి… తంగిరాల సౌమ్య


విశాలాంధ్ర నందిగామ:-సేవ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అయ్యప్ప సేవా సమితి వారి సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు సోమవారం నందిగామ మెయిన్ బజార్ లో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఆమె స్థానిక కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు మొదటి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రజాసేవలో కొనసాగుతున్న అయ్యప్ప సేవాసమితి వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు వేసవికాలంలో ప్రజలకు చల్లని నీరు అందిస్తూ సమాజానికి శరణం కలిగించే ఈ చలివేంద్రం తో పాటు వారు చేస్తున్న పలు రకాల సేవలకు సేవా సమితి వారి నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక నాయకులు సమితి సభ్యులు ప్రజలు పాల్గొన్నారు…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *