అమెరికా, ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక
తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.
ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. త్వరలోనే వారికి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని భద్రతాధికారి పేర్కొన్నారు. 48 గంటల్లోగా హోర్మూజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. లేదంటే నరకం చూపిస్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై తాజాగా ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికను అది ఒక తెలివితక్కువ చర్యగా అభివర్ణించింది. ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి మీడియాతో మాట్లాడుతూ… శత్రువులు తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు. ధీటుగా స్పందిస్తామని హెచ్చరించారు. హోర్మూజ్ దరికి వారు రాలేరన్నారు.
The post అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్ appeared first on Visalaandhra.


