అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు


కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ

న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్‌గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. “మోదీ ఏం చేయగలరో, ఏం చేయలేరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కచ్చితంగా తెలుసు. ప్రధాని రాజీపడితే, మన విదేశాంగ విధానం కూడా రాజీపడినట్లే. ఆయన నిన్న పార్లమెంటులో ఏమాత్రం సంబంధం లేని ప్రసంగం చేశారు. పరిస్థితి కొవిడ్‌లాగా ఉంటుందని మోదీ అంటున్నారు. కానీ కరోనా సమయంలో ఎంతమంది చనిపోయారో, ఎన్ని విషాదాలు జరిగాయో ఆయన మర్చిపోయారు. మోదీ ప్రధాని తగ్గట్టుగా ఉండాలి. కానీ అలా ఉండటం లేదు. దేశానికి అది హానికలిగిస్తుంది. ఎల్పీజీ, పెట్రోలు, ఎరువులు… ఇటువంటివి సమస్యలుగా తయారవుతాయి. ప్రభుత్వం ఇటువంటివి అర్థం చేసుకోలేకపోతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *