అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యమయ్యాడు కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9 నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. సాకేత్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అతడు చివరిసారిగా క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న లేక్ అంజా సమీపంలో కన్పించినట్లు తెలుస్తోంది. అక్కడ అతడి పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌లను అధికారులు గుర్తించారు. అతడిని గుర్తించేందుకు స్నేహితులతో కలిసి స్థానిక అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అమెరికా అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.


