విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో పలువురు టిడిపి కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.


