విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, సొసైటీ సభ్యులు ఎంజీ నరసన్న, నాయకులు గౌళ్ల నల్లారెడ్డి, బుసిరెడ్డి, కల్లు లక్ష్మన్న, కోడిగుడ్ల లక్ష్మన్న, సుక్కు నరసన్న, కంపాటి రాముడు తదితరులు పాల్గొన్నారు.


