ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 112.35 పాయింట్ల లాభంతో 23,114.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్, రిలయన్స్ స్టాక్స్ లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4665 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
The post అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం appeared first on Visalaandhra.


