అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ


ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే బీసీ కాలనీలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, టీడీపీ బూత్ కమిటీ ఇన్ చార్జ్ తలారి అంజీ వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పింఛన్లు పంపిణీ చేశారు. చిన్నతుంబళంలో సొసైటీ అధ్యక్షులు కందనాతి నరసప్ప, టీడీపీ నాయకులు వీరేష్ గౌడ్, సిద్దప్ప ధని, శివ, కంబదహాల్ లో టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, అవ్వాతాతలకు సామాజిక పింఛన్లను అందజేశారు. హెచ్ మురవణిలో సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యన్న గౌడ్, గ్రామ అధ్యక్షులు సొంటెన్న, యూనిట్ ఇన్ చార్జ్ దుమ్మల శివ, రామలింగ, నరసయ్యలు, హనుమాపురంలో టీడీపీ నాయకులు బీపీ ఈరన్న, రంగన్న, పెద్దయ్య, రాజశేఖర్, చిన్నకడబూరులో ఆర్టీఎస్ తాలూకా కన్వీనర్ దశరథ రాముడు, బాపులదొడ్డిలో టీడీపీ నాయకులు నర్సిరెడ్డి అవ్వాతాతలకు పింఛన్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరంలాంటివని అన్నారు. ఒక రోజు ముందుగానే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *