విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో మహిళలు సాధిస్తున్న విజయాలు సమాజానికి గర్వకారణమని అన్నారు. మహిళా సాధికారత సాధన ద్వారా సమాజంలో సమానత్వం, అభివృద్ధి, శాంతి సాధ్యం అవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కార్యక్రమాలు ద్వారా మహిళలను మరింత బలపర్చేందుకు ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు కలిసి కృషి చేస్తున్నాయని తెలిపారు. మహిళలు తమ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకుని సమాజ అభివృద్ధికి ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సంధర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మహిళ సురక్షితంగా, గౌరవంగా, స్వావలంబనతో జీవించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు.


