విల్సన్ పాల్
విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను ఉటంకిస్తూ మహిళాహక్కులను తెలియజేసే చర్చలు, స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో మహిళలను చైతన్యపరచే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ఆర్.సూర్యనారాయణ, ఎం.రమేష్ కుమార్ల పర్యవేక్షణలో రాష్ట మరియు జిల్లా మహిళావిభాగం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈకార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసి మహిళా శక్తిని చాటాలని విల్సన్ పాల్ కోరారు. విజయవాడ వెళ్లే మహిళల కొరకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథిగృహ ప్రాంగణంలోగల సంఘ జిల్లా కార్యాలయం నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


